తహశీల్దార్ కాంతయ్యకు ఉత్తమ సేవా పురస్కారం

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /కరకగూడెం ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిబద్దలతో కృషిచేస్తున్న తాసీల్దార్ వట్టం కాంతయ్య ఉత్తమ సేవా పుర‌స్కారానికి ఎంపికయ్యారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ శాలువా, ప్రశంసాపత్రంతో సత్కరించారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram