ప్రజావాణికి అధికారుల డుమ్మా

 6 శాఖల నుంచి హాజరుకాని ఉద్యోగులు

 

గోల్డెన్ న్యూస్ //కరకగూడెం// మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు అయ్యారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 17 శాఖల ఉద్యోగులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 11 శాఖల ఉద్యోగులు మాత్రమే హాజరయ్యాయి. మరో 6 శాఖల ఉద్యోగులు డుమ్మా కొట్టారు.ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడంలో ప్రజావాణికి ప్రత్యేకత ఉంది. సోమవారం మండలంలో నిర్వహించిన ప్రజావాణికి. తాసిల్దార్ ఎంపీడీవో హాజరవుతున్నా వివిధ శాఖల ఉద్యోగులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికి వివరించాలనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేటి ప్రజావాణిలో అధికారులకు మొత్తం ఆరు దరఖాస్తులు అందాయి. ఇందులో ఒంటరి మహిళలకు సంబంధించినవి మూడు దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించినవి రెండు దరఖాస్తులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తులు అందాయి. స్వీకరించిన అధికారులు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ప్రజావాణికి డుమ్మా కొట్టిన శాఖల ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram