గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కేసీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేకుందుకు కుట్రపన్నుతున్నదని ఆరోపించారు. ఈ మేరకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని ప్లకార్డులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కరకగూడెం మండల కేంద్రంలో నిరసన,రాస్తారోకో చేపట్టారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నాడు కేసీఆర్ ముందు చూపుతో పేదింటి ఆడబిడ్డల కన్నీళ్లను తుడిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
Post Views: 55









