ఆస్తి లేదని కొరివి పెట్టని కొడుకు. మంటగలిసిన బంధాలు!
గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్/ఆంధ్ర ప్రదేశ్ ఆస్తి అంతస్తులు ఇవ్వలేదని తండ్రి శవానికి తలకొరివి పెట్టడానికి కొడుకు తిరస్కరించిన ఘటన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో వెలుగుచూసింది. తండ్రి వెంకటేశ్వర్లు మరణిస్తే డబ్బుపై ఉన్న మోజుతో కన్న పేగు బంధాన్ని తెంచేసుకున్నాడా కొడుకు. డబ్బు పిచ్చి ముందు కన్నవారి ప్రేమ ఎంత చులకనైపోయిందో అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. ఈ విషాద సమయంలో కూతురు నాగరత్నం నేనున్నానంటూ తండ్రికి చివరి వీడ్కోలు పలుకుతూ అంత్య క్రియలు పూర్తిచేశారు.
Post Views: 41









