ఆదివాసీ విద్యార్థినులకు దుస్తుల పంపిణీ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /ఈ రోజు (శుక్రవారం) కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఏడూళ్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు మరియు కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి వలస ఆదివాసిల గ్రామమైన అంగారిగూడెంలో చిన్న పిల్లలకు దుస్తులు అందజేయటం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఏడూళ్ళ బయ్యారం సిఐ  మాట్లాడుతూ.. ప్రతి ఆదివాసి కుటుంబం వారి యొక్క పిల్లల్ని క్రమం తప్పకుండా స్కూలుకు పంపించి వారు చదువుకునేటట్లుగా చేయాలని వారికి ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ వారిని కూడా సమాజంతోపాటు ముందుకు నడవాలని సూచిస్తూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందించవద్దని సూచించడం జరిగింది..

 

Facebook
WhatsApp
Twitter
Telegram