గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యాన మండల పరిధిలోని రేగళ్ల పంచాయతీ పడిగాపురం గ్రామంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులపై వారికి అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాలలో నీరు నిలవ ఉండరాదని నీటిలో పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు ఆహార పదార్థంలపై మూతలు పెట్టుకోవాలని, వేడిగా ఉండే ఆహారం సేవించాలన్నారు, వర్షాకాలం కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జ్వరం వస్తే వైద్యసిబ్బంది ని సంప్రదించి పరిక్షలు చేయించుకో వాలని, ఏవైనా సమస్యలుంటే పి హెచ్ సి కి రావాలని తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ కృష్ణయ్య, హెచ్ ఏ నరసింహారావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.









