రూ.75 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన చందానగర్‌ ఎస్ఐ, కానిస్టేబుల్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్/  ఓ క్రిమినల్ కేసులో ఫిర్యాదుదారునికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.75,000 లంచం తీసుకుంటుండగా చందానగర్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ను శనివారం తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులను చందా నగర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ బండేల బల్ రాజ్, పోలీస్ కానిస్టేబుల్/రైటర్ బి. రాఘవేంద్ర కుమార్ (పీసీ-7491) గా గుర్తించారు. చందా నగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 696/2026కు సంబంధించి అధికారులు ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరిపి, ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు డబ్బు కోరారు. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి దర్యాప్తు జరిపి చార్జిషీట్ దాఖలు చేయడానికి ఎస్ఐ బండేల బలరాజ్, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర కుమార్ ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఎస్ఐ బలరాజ్ ఫిర్యాదుదారు నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఎస్ఐ కార్యాలయ టేబుల్ డ్రాయర్ నుంచి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలాఉంటే, అంతకుముందు ఎస్ఐ బలరాజ్ రూ.20 వేలు నగదు రూపంలో, కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్ యూపీఐ (UPI) ద్వారా రూ.10 వేలు ముందస్తుగా స్వీకరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. విధులను దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందేందుకు యత్నించిన ఈ ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే పౌరులు టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram