ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలి.
ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ రేపటి నుండి జరిగే ఆటోల నిరవధిక బందుకు సిపిఎం పార్టీ కరకగూడెం మండల కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇస్తానన్న 12000 రూపాయలు వాగ్దానాన్ని నెరవేర్చాలని వారన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవి ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని ,ఆటో, రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ,పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఓలా, ఉబర్ రాపిడో, యాప్ లకు బదులుగా ప్రభుత్వం కొత్త యాప్ తీసుకురావాలని రోజువారీగా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు ఈ ఛానల్ నుంచి మినహాయించాలని యాక్సిడెంట్ భీమాను కొనసాగించాలని, సాధారణ మరణానికి వర్తింపజేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ జరుగుతుందని ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు చర్ప సత్యం పాల్గొన్నారు









