కస్తూర్బాలో పాఠశాలలో బీభత్సం

అడుగడుగునా కోతులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలోకి కోతులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కడనుంచో కోతులను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వదిలి వెళ్లారని ప్ర జలు చెబుతున్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాల  అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల పాఠశాలలోకి కోతులు పెద్ద సంఖ్యలో చేరి హాస్టల్లో విద్యార్తులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని. కొంత కాలంగా హాస్టల్ పరిసరాల్లో కోతులు వీర విహారం చేస్తూ విద్యార్తులను భయపెట్ట డంతో పాటు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను గాయప రిచిన ఘటనలు కూడా జరుగుతున్నాయని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు హాస్టల్ లోపలకు ప్రవేశించడంంతో విద్యార్థుల ఏం చేయాలో తెలియక గదుల్లోకి వెళ్లి తలుపులు మూసుకుంటున్నారు. కోతులు గుంపులు, గుంపులుగా వచ్చి విద్యార్థులపై దాడికి ప్రయత్నిస్తున్నాయి.పంచాయితీ అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్థులు, సిబ్బందిని రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram