గోల్డెన్ న్యూస్ /యాదాద్రి భువనగిరి/ ఆలేరు తహసీల్దార్ కార్యాలయం పై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తాము నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అధికారులు ప నల్లగొండ ఏసీబీ అధికారులు మీడియాకు వెల్లడించారు. తమ తండ్రికి సంబంధించిన భూమి ఫౌతి కోసం ఇద్దరు అధికారులు లంచం అడిగారని తమకు ఫిర్యాదుదారుని ద్వారా అందిన ఫిర్యాదు మేరకు నిర్వహించిన దాడుల్లో తహసీల్దార్ కార్యాలయానికి చెందిన ఆర్ఐ పూర్ణచందర్ రావు, గ్రామ పాలనాధికారి షేక్ అహ్మద్ లు తీసుకున్న 14 వేల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ఇరువురిని హాజరుపరచనున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లంచం ఆశించి ఇబ్బందులకు గురి చేస్తే అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందివ్వాలని వారు సూచించారు.
Post Views: 16









