10 రాష్ట్రాల మీదుగా సాగే పొడవైన హైవే.. NH-44
దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారిగా NH-44 గుర్తింపు పొందింది. సుమారు 4,112 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు సాగుతుంది. 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా వెళ్లే NH-44.. ఢిల్లీ, నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు, మధురై వంటి ప్రధాన నగరాలను కలుపుతోంది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య రవాణా, వాణిజ్యానికి ఇది కీలక మార్గంగా కొనసాగుతోంది.
Post Views: 8







