తెలంగాణాలో రేపటి నుంచి బార్లు బంద్ !
తెలంగాణలో సోమవారం (అక్టోబర్ 5) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బార్ల లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపు పేరుతో ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.40 లక్షలుగా ఉన్న లైసెన్స్ ఫీజును రూ.44 లక్షలకు పెంచి భారం మోపుతున్నారని మండిపడింది. ప్రివిలేజ్ సెస్‌ను స్లాబ్ పద్ధతిలో 8% నుంచి 20 శాతానికి పెంచారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
Post Views: 8








