వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

1. తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.

2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.

3. విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.

4. విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియ చేయవలెను.

5. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.

6. కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.

7 చిన్న పిల్లలు కరెంటు వస్తువులను ముట్టకుండా చూసుకోవాలి.

8. ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.

9. గాలి, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.

10. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.

11. కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.

12. ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెల్లాలి.

Facebook
WhatsApp
Twitter
Telegram