నాలుగు గంటల్లో హైదరాబాద్ నుండి విశాఖపట్నం

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలులో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది.. కనీసం వందే భారత్‌లో వెళ్లినా 8 గంటలు పడుతుంది.ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయితే మరో మూడు నుంచి నాలుగు గంటలు అదనం. కానీ కేవలం నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు.దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

 

శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్‌ను రైల్వే శాఖ ఖరారు చేసింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ లైన్‌ను ప్రతిపాదించారు.దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు.ఈ రైల్వే కారిడార్ విశాఖపట్నం నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్.

Recent News :

Mohammed Rafee

Mohammed Rafee

Admin

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram