‘జమిలి’ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర క్యాబినెట్ జెమినీ ఎన్నికల బిల్లుకు ఆమోదం

– ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ త్వరలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

ఓకే దేశం- ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో సభలో బిల్లులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 13, 14 తేదీల్లో తమ తమ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లను సంప్రదించేందుకు కూడా ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

బిల్లు తెచ్చేందుకు ఈ సమావేశాల్లోనే వ్యూహం

పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన నివేదికకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే పచ్చజెండా ఊపింది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ జమిలి బిల్లుకు ఆమోదం తెలిపింది…

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram