అమరావతిలో పైప్ లైన్ ద్వారా గ్యాస్.?

గోల్డెన్ న్యూస్/ అమరావతి: దేశంలోనే పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐవోసీ ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పీఎనీఆర్బీ సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించింది.గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్-టెక్ సిటీ (గిఫ్ట్) లో గ్యాస్, విద్యుత్, టెలికం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకూ పైపైలైన్ ద్వారా గ్యాస్ అందుతోంది.అదే తరహాలో రాజధాని అమరావతికి పైపైన్ ద్వారా గ్యాస్ అందించి, దేశంలో మొట్టమొదటి పైప్ గ్యాస్ వినియోగించే రాజధానిగా చేస్తాం’ అని ఐవోసీ బృందం తెలిపింది. ఈ ప్రతిపాదనకు సీఎస్ అంగీకారం తెలిపారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram