విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా!

హైదరాబాద్: విద్యాశాఖ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు. 2003 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాణా.. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్య తలు నిర్వహిస్తున్నారు.

అయితే విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్న బుర్రా వెంకటేశంను రాష్ట్ర ప్రభు త్వం గతేడాది డిసెంబర్‌లో టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియ మించింది. దీంతో ఎన్‌, శ్రీధర్‌కు అదనపు బాధ్య తలు అప్పగించారు.

తాజాగా యోగితా రాణాను సెక్రెటరీగా నియమించడం తో శ్రీధర్‌ను ఆ బాధ్యతల నుంచి విద్యాశాఖ రిలీవ్‌ చేసింది.కాగా, ఎన్‌. శ్రీధర్‌కు గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా 2006 బ్యాచ్‌కు చెందిన కే. సురేంద్ర మోహన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు ఆదేశాలు జారీచేశారు. యోగితా రాణా.. 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. 2002లో సివిల్‌ సర్వీసెస్‌లో మూడో ప్రయ త్నంలో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యారు.

2003లో సివిల్స్‌లో నాలు గో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించ డంతో విశాఖ జిల్లాలో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నారు.

అనంతరం భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేశా రు. ఆ తర్వాత యూఎన్‌ డీపీలో మూడున్నరేండ్లు బాధ్యతలు నిర్వహించారు. 2017లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ ‘ఈ-నామ్’ అమలులో జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram