ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలల ప్రిన్సిపల్ లు మరియు మునిసిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి మనలోకి వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ – కరీంనగర్ స్థానాలతో పాటు వరంగల్ – ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీకానుండగా ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారని, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు విధించారని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, మార్చి మూడవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్‌, పబ్లిక్‌ పార్‌ వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టికర్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చెరిపివేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను కవర్‌ చేయాలన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram