ఈసారి ఢిల్లీ పీఠం వారిదే..?

ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి .?

గోల్డెన్ న్యూస్/ న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబో తున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎగ్జిట్ పోల్ తన అంచనాలను ప్రకటించింది.

 

ఇందులో ఈసారి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో ఆప్ ఆధిప త్యానికి గండి కొట్టబోతున్న ట్లు తెలిపింది.ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించు కోబోతున్నట్లు తెలిపింది.

 

అలాగే అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించబో తున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీ దున్న ఆప్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోరు సాగింది. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ వరుసగా నాలుగోసారి డిల్లీలో అధికారం దక్కించు కునేందుకు శ్రమించారు.

 

అయితే కేంద్రంలో మూడో సారి గెలిచినా ఢిల్లీని గెలవలేకపోతు న్నారన్న అపప్రదను పోగొట్టుకునేం దుకు బీజేపీ నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపుతెచ్చాయి.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram