గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : గుండెపోటుతో మహిళ మృతి చెందిందని చెప్పిన భర్త, అత్తమామలు.. ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చేలోగా అక్కడినుంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు. వారి స్వగ్రామం శ్రీశైలం సమీపంలో దోమలపెంటకు అంబులెన్సులో తరలించేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు వెంటనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నగరానికి తరలించారు. చనిపోయిన మహిళ ఒంటిపై గాయాలు ఉండటం గమనించిన ఆమె తల్లిదండ్రులు.. హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారంటూ చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Post Views: 41









