గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 14 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు. ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమం ద్వారా అమాయక గిరిజన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారుల ఎదుట చత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 14 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయారన్నారు.
Post Views: 74









