ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య

18 ఏళ్లయింది.. ఆయనకు ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.. భార్య ఇంట్లోనే ఉంటుంది.. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.. అంతా బాగానే ఉంది.. భర్త మద్యానికి బానిసయ్యాడని.. అతన్ని చంపితే ఓ కొడుక్కి ఉద్యోగం వస్తుందని స్కెచ్ వేసింది.. దాన్ని ఓ రోజున అమలు చేసి.ఏం తెలియనట్టు నటించింది.

గోల్డెన్ న్యూస్ /నల్లగొండ : ఉస్మాన్‌పురంలో నివసిస్తున్న మహ్మద్‌ ఖలీల్‌ హుస్సేన్‌ (44) కనగల్‌ మండలం చర్లగౌరారం జడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. హుస్సేన్‌ మానసికంగా ఇబ్బందులు పడుతుండడంతో వైద్యుడిని సంప్రదించి మందులు వాడుతున్నారు. హుస్సేన్‌ చనిపోతే ఉద్యోగం తనకుగాని, పిల్లలకు గాని వస్తుందని ఎలాగైనా అతడిని హతమార్చాలని నిశ్చయించుకున్న ఆయన భార్య అక్సర్‌ జాహా గత నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖురాన్‌ గ్రంథం పెట్టే స్టాండ్‌తో ఆయన్ను బలంగా కొట్టింది.

అనంతరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి నామమాత్రంగా చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లింది. అదే రోజు రాత్రి పరిస్థితి విషమించడంతో హుస్సేన్‌ను నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనపై అనుమానం ఉందని ఫిబ్రవరి 25న హుస్సేన్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసిన పోలీసులు హుస్సేన్‌ భార్య అక్సర్‌ జాహానే ఆయన్ను చంపినట్లు నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram