50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లొద్దు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున మండలంలోని ప్రజలు 50 వేలకు మించి నగదు తమ వెంట తీసుకువెళ్లకూడదని కరకగూడెం ఎస్ ఐ పివిఎన్ రావ్ అన్నారు..

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కావున అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని సీజ్ చేస్తాము తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును  స్థాానిక రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారన్నారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేయటం జరుగుతుంది అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలి తనిఖీల సమయంలో అవి చూపించినట్లయితే  త విచారించిన తరువాత విడుదల చేయటం జరుగుతుందని రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున షాపింగ్ చేసిన యెడల దానికి సరియైన బిల్ ను తీసుకొని మాత్రమే వాటిని తీసుకొని.రావాలని మంగళవారం కరకగూడెం ఎస్ఐ  ఎస్ ఐ  తెలిపారు..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram