గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి కొమరం నాగేశ్వరరావు (40) అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోవడం జరిగింది. మృతుడు కి 10 ఏళ్ల లోపు వయసు 3 కూతుర్లు ఉన్నారు. ఇల్లు లేని పరిస్థితి ఉంది. పూరి గుడిసెలో ఉంటున్నడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ మహిళా అధికారిణి ఏడూళ్ళ బయ్యారం రేంజ్ ఎఫ్ ఆర్ ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడు పోలె బోయిన సాంబశివరావు, ద్వారా మృతుడి భార్యకు అందజేశారు. మానవత్వం చాటుకున్న ఏడూళ్ళ బయ్యారం ఎఫ్ ఆర్ ఓ ను పలువురు అభినందించారు..
Post Views: 233









