గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, వరంగల్ జిల్లాకు చెందిన శ్రేయా అనే యువతి తాను ఉంటున్న హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి, ప్రైవేట్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న శ్రేయా, శనివారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 29









