జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్లో జోష్

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : జూబ్లీహిల్స్ లో ఉపఎన్నికలో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ తనకే  అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నది. గెలుపు కోసం సమష్టిగా వ్యూహాలను  అమలు చేస్తూ ఓటర్ల వద్దకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ 2009లో మాత్రమే ఇక్కడ గెలిచింది. ఆ ఎన్నికల్లో దివంగత పీజేఆర్ కుమారుడుపి.విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీవిజయం సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్నుంచి పోటీచేసిన అజారుద్దీన్బైఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అజారుద్దీన్63వేలకు పైగా ఓట్లు సాధించారు. సుమారు 16ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించిన ట్రాక్ రికార్డు లేదు. అలాంటి నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో గెలవడం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్ పరిధిలో విజయం సాధించలేదు.తర్వాత కంటోన్మెంట్  నియోజక వర్గ పరిధిలో ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో స్వల్పతేడాతో దానం నాగేందర్ ఓడిపోయారు. ఇటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి, చేవెళ్ల ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో సత్తాచాటాల్సిన పరిస్థితి వచ్చింది. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో అన్ని సర్వేలు కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో అధికారపార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. క్లిష్టమైన సమయంలో వచ్చిన ఈ ఉపఎన్నికలో విజయం సాధిస్తే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి బూస్ట్ వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram