గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి
గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.
ఇంట్లో చిన్న పిల్లలకైనా.. అలాగే వయసులో పెద్దవాళ్లకు అయినా చికెన్ మటన్ ఫిష్ పెట్టేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త పాటించండి లేకపోతే ఇలాంటి పరిస్థితి రావాల్సి వస్తుంది..
Post Views: 62









