అయ్యో పాపం వలస గిరిజనుడు

గోల్డెన్ న్యూస్/ ములుగు : జ్వరంతో బాధపడుతున్న ఓ గుత్తికోయ గిరిజనుడిని డోలిలో ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన ములుగు పరిధి వెంకటాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

 

పామూరుకు చెందిన వలస ఆదివాసి మడవి ఆడుమ అనే వ్యక్తి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. 

 

 గమనించి బంధువులు, స్థానికులు పామూరు గుట్టలపై నుంచి ఓ కర్రకు డోలీ కట్టి బొల్లారానికి, తరలించారు అక్కడి నుంచి 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

 

అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram