ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటన – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె. నోటీసులు ఇచ్చామని.. ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 332 డిమాండ్లు పెట్టినట్లు జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ డ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Post Views: 222









