రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్న ఇసుక లారీలు
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో సోమవారం హృదయ విధాకర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రాణాలు పోతున్నా.. ఆస్పత్రికి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఇసుక లారీలతో ట్రాఫిక్ జామై ప్రజలు ఇబ్బంది పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబాయి గూడెం-రామానుజవరం గ్రామాల మధ్యలో ఇసుక లారీలకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే నిలిపేశారు. దీంతో ఆ రహదారిపై ఇతర వాహనాలు వెళ్లే దారి లేక సోమవారం సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. థర్మల్ పవర్ స్టేషన్లో కూలీ పనులు చేసి జీవించే డైలీ వ్యక్తి వంశీ (33) గడ్డి మందు సేవించాడు. గమనించిన తోటి కార్మికులు వంశీని వెంటనే 108 సాయంతో మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న క్రమంలో. సాంబా యిగూడెం- రామానుజవరం గ్రామాల మధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దిక్కు తోచని స్థితిలో తోటి కార్మికులు వంశీని చేతులపై మోసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆలోపే వంశీ ప్రాణాలు విడిచాడు.








