సౌదీకి బయలుదేరిన 35 మంది బాధితులు

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : సౌదీ అరేబియాకు పంపించేందుకు 45 మంది మృతుల కుటుంబాల నుంచి 35 మందిని, ముగ్గురు హజ్ హౌస్ ప్రతినిధులను ఎంపిక చేశారు. వీరంతా నాంపల్లిలోని హజ్ హౌస్ నుంచి మంగళవారం రాత్రి10 గంటలకు 2 ప్రత్యేక బస్సుల్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3గంటలకు విమానం బయల్దేరి ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుతుంది. ఇప్పటికే మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం సౌదీకి చేరుకుంది. ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు ఎవరివో తేల్చడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లిన కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించి మృతుల డీఎన్ఏతో పోల్చి గుర్తిస్తారు. ఆ తర్వాత మరణ ధ్రువపత్రాలను జారీ చేస్తారు. మృతులకు అంత్యక్రియలు గురువారం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram