దారి ఇవ్వలేదని. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

గోల్డెన్ న్యూస్ / రాజన్న సిరిసిల్ల :  జిల్లాలో రోడ్ రేజ్ ఘటన మరోసారి సంచలనం సృష్టించింది.ఆర్టీసీ బస్సు డ్రైవర్పై… కారు యజమాని  దాడికి యత్నించాడు. తన  కారు దారి ఇవ్వలేదని ఆగ్రహించిన అతడు.. బస్సును అడ్డగించి డ్రైవర్పై దాడికి దిగాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం సమీపంలో జరిగింది, తన కారును ఆర్టీసీ బస్సు అడ్డంగా పెట్టి. అంతటితో ఆగకుండా కదులుతున్న బస్సు ఎక్కి. డ్రైవర్ ను చితకబాదాడు. కారు యజమాని ఇలా వ్యవహరించడంపై బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రయాణికులు జోక్యం చేసుకొని కారు యజమానిని అడ్డుకోవడంతో పరిస్థితి  సద్దుమణిగింది.  రాజన్న సిరిసిల్ల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కారు యజమాని ప కేసు నమోదు చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram