పోలీసులపై గ్రామస్తుల దాడి : పలువురిపై కేసు నమోదు

గోల్డెన్ న్యూస్ / కామారెడ్డి:  జిల్లాలోని రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులపై మద్దికుంట గ్రామస్తులు దాడి దిగారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఓ కేసు విషయంలో మద్దికుంట గ్రామానికి చెందిన యువకుడిని అరెస్టు చేయడానికి ఆంధ్ర పోలీసులు వచ్చారు. యువకుడిని అరెస్టు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆంధ్ర పోలీసులను మద్దికుంట గ్రామస్తులు ప్రతిఘటించారు. గ్రామస్తులు వెంబడించడంతో స్థానిక రామారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆంధ్ర పోలీసులు ఆశ్రయించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న మద్దికుంట గ్రామస్తులు ఆంధ్ర-తెలంగాణ పోలీసులపై దాడికి యత్నించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామస్తులు పోలీసులకు మధ్యకొద్ది సేపు తోపులాట జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కు చెందిన భూసి బేబీకి దుబాయిలో ఉన్నప్పుడు రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రమేశ్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు తనను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగికంగా లోబర్చుకొని మోసగించాడని కొద్ది రోజుల క్రితం భీమవరం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి మద్దికుంట గ్రామానికి భీమవరం రూరల్ ఎస్సై వీరరాజు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. మద్యం మత్తులో రమేశ్ వీరితో దురుసుగా ప్రవర్తించాడు. రమేశ్ కుటుంబ సభ్యులు వీరిపై దాడికి ప్రయత్నించారు. సివిల్ డ్రెస్ లో ఉండడంతో మీరు పోలీసులు కాదంటూ గ్రామస్తులు అగ్రహించారు. స్థానిక రామారెడ్డి పోలీసులకు భీమవరం  పోలీసులు సమాచారం ఇచ్చారు. రమేశ్ తో పాటు పలువురు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. బూసి బేబీని ప్రేమాయణంతో సుమారు రూ. 12 లక్షలు, 8 తులాల బంగారాన్ని రమేశ్ కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రమేష్ గత కొద్ది నెలల క్రితం పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకుని బూసి పట్టించుకోకపోవడంతో ఈ వివాదం చెలరేగినట్టు తెలిసింది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram