గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : గ్రామపంచాయతీ ప్రజలు చర్చించుకొని సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల వి.వెంకటాయపాలెంలో చేపట్టిన 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ డ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ. 10 లక్షల గ్రాంటు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళకు వద్దకు వెళ్లి, బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందించాలని సూచించారు.
Post Views: 136








