రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం చివరి రోజైన శనివారం రాత్రి వరకు కొనసాగింది. వాస్తవానికి నామినేషన్ల దాఖలుకు సాయంత్రం ఐదు గంటల వరకే గడువు ఉంది. అయితే, పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సాయంత్రం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో 5 గంటల వరకు వచ్చిన వారందరి నుంచీ స్వీకరించాలని నిర్ణయించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో నామినేషన్లు స్వీకరించారు.

ఈ క్రమంలో కరకగూడెం మండలం సమత్ మోతే, గొల్లగూడెం గ్రామాల్లో రాత్రి 12:30 వరకు సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు నామినేషన్ల కోసం బారులు తీరారు. వారి వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నందుకు అధికారులు సహకరించారు.

గ్రామపంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తొలి దశ పోలింగ్ డిసెంబరు 11న నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram