టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / టీఎస్ యుటిఎఫ్ కరకగూడెం మండల నూతన కమిటీని ఆదివారం రోజు ఎన్నిక జరిగింది. అధ్యక్షులు భూక్య శేఖర్, ప్రధాన కార్యదర్శి కోట్ల సూర్యనారాయణ రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ 12 వ మహాసభ మండల ప్రధాన కార్యదర్శి కోట్ల సూర్యనారాయణ రాజు  అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా టీఎస్ యుటిఎఫ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు ..ఉపాధ్యాయ ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి నీ వెంటనే ప్రకటించాలని, ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఉపాధ్యాయుల ను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుండి మినహాయించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును ఉద్దేశించి మాత్రమే ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఐదు సంవత్సరాలు సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు అందరూ తాము సర్వీస్ లో కొనసాగాలంటే , పదోన్నతి  పొందాలంటే ఉపాధ్యాయులు తప్పక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాలని నిబంధన విధించడం సరి కాదని తెలిపారు. వెంటనే విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులు టెట్ నుండి గ్రహించాలని కోరారు, అదేవిధంగా ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ డి ఏ లను వెంటనే విడుదల చేయాలని, పిఆర్సి నివేదిక తెప్పించుకొని మెరుగైన పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం కరకగూడెం మండల శాఖకు సంబంధించి ఎన్నిక జరిగింది. ఎన్నికకు ఎన్నికల అధికారిగా రాష్ట్ర కమిటీ సభ్యులు బి. రాజు  అబ్జర్వర్లుగా జిల్లా కార్యదర్శులు బి. రాము , పాషా  వ్యవహరించారు. మండల నూతన కమిటీ. మండల అధ్యక్షులుగా భూక్య శేఖర్ , ప్రధాన కార్యదర్శిగా కోట్ల సూర్యనారాయణ రాజు, ఉపాధ్యక్షులుగా Y. సర్వేశ్వర రావు , B. భావ్ సింగ్ , కోశాధికారి గా రఘు  , కార్యదర్శులుగా సుజాత , ప్రసాద్ , మహిళా కన్వీనర్ గా S.సరోజినీ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram