ఘనంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కరకగూడెం మండల కేంద్రంలో  అయ్యప్ప మాలధారుల ఇరుముడి మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. మాలధారులు, బంధువులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 41 రోజులపాటు దీక్ష చేసి గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని శబరిమలై జ్యోతి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. కుర్నవల్లి లక్ష్మీదేవి ఆలయంలో గురు స్వాములు గుమ్మడి వల్లి కృష్ణ , గుమ్మడి వల్లి శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram