గాంధీ ఆస్పత్రికి తరలింపు
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / ఈరోజు (గురువారం) సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న ను కలిసేందుకు వచ్చానని స్థాఫ్ తో చెప్పారు.. మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని సిబ్బంది చెప్పి పంపించారు.. అక్కడి నుండి కిందకి వచ్చిన వ్యక్తి Q న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.. గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు..ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం విషమం గా ఉందని తెలుస్తుంది…
విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించనున్నట్లు సమాచారం.









