గోల్డెన్ న్యూస్ / చండూరు / తెలంగాణ రాష్ట్ర ఏసీబీ దూకుడు మీద సాగుతుంది. సగటున రోజుకో అవినీతి అధికారిని పట్టుకుంటుంది. తాజాగా చండూరు డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ను లంచం సొమ్ముతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తెరెడ్డిపల్లికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదుదారుల వివరాలు కోరారు. వివరాలు అందించేందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ వారి నుంచి రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో లంచం తీసుకుంటూ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
Post Views: 41









