లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయితీ కార్యదర్శి

గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల / ఇందిరమ్మ ఇంటి పురోగతిని యాప్ లో నమోదు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ  కార్యదర్శి శుక్రవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గొల్లపల్లి రాజకుమార్ ఇందిరమ్మ ఇంటి పురోగతిని యాప్ లో నమోదు చేసి ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించడం కోసం ఓ లబ్ధిదారుడి నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేసి. అంత డబ్బు ఇచ్చుకోలేమని బాధితులు. రూ.5 వేలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో బాధితుని వద్ద నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలను ఆదిలాబాద్ ఏసీపీ డీఎస్పీ మధు వెల్లడించారు. 

Facebook
WhatsApp
Twitter
Telegram