ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు ఉదయం 8 గంటల వరకు దట్టంగా కురుస్తోంది.
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / ఆదిలాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం, కేవలం సింగిల్ డిజిట్ కె పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో రాష్ట్రంలో అత్యధికంగా అడవులు ఉన్న జిల్లా ఆదిలాబాద్ వణికిపోతున్నది. నిన్న, మొన్నటి వరకు సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలే నమోదు కాగా.. ఆదివారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, బోథ్ ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకున్నాయి. దీంతో వాహనల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
గిన్నె ధరీ 6.6..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు చాలా చోట్ల కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతం మంచు దుప్పటి కమ్మేసింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో వృద్ధులు.పిల్లలు అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కొమురం భీమ్ జిల్లా గిన్నెధరిలో 6.6 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 6.8, నిర్మల్ జిల్లా పెంబిలో 9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 10.4 గా కనిష్ట నమోదవుతున్నాయి..










