ముషీరాబాద్‌లో దారుణ హత్య

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ దారుణం చోటుచేసుకుంది. వారాసిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని (17) దారుణ హత్యకు గురైంది. మేనమామ వరసయ్యే యువకుడు యువతి తల్లి కళ్లముందే కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడు.. ఘటనాస్థలిలోనే కత్తి, సెల్ఫోన్ వదిలేసి పరారయ్యాడు. సమాచారం

 

భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు ఒక్కసారిగా దాడికి దిగడంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యుల కేకలు వినగానే స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram