గోల్డెన్ న్యూస్ /వికారాబాద్ /చౌడాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. తమ అక్రమ సంబంధానికి అడొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. అయితే మృతుడు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చౌడాపూర్లో రత్నయ్య, కవిత భార్య భర్తలు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో కవితకు పరిచయం ఏర్పడింది. ఇది వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం.. భర్త రత్నయ్యకు తెలిసింది. దాంతో కవితను రత్నయ్య మందలించాడు.వీరి వివాహేతర బంధానికి వివాహక సంబంధం బయటపడింది భర్త అడ్డువస్తున్నాడని.. తన ప్రియుడితో కలిసి రత్నయ్యను ట్రాక్టర్‌తో గుద్ది చంపింది. ఈ దారుణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
Post Views: 60









