పిచ్చి కుక్క దాడి.. 20 మందికి గాయాలు

గోల్డెన్ న్యూస్ / వేములవాడ / రాజన్న ఆలయం వద్ద ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం వద్ద  పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 20 మందికి పైగా భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు.

ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చే రాజన్న ఆలయం పరిసరాల్లో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు స్థానిక వ్యాపారులు, దారిన వెళ్తున్న వారిని కూడా ఆ కుక్క కరిచినట్లు బాధితులు చెబుతున్నారు.కుక్క దాడిలో గాయపడిన వారిని వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం ఆలయానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిచ్చి కుక్కలను పట్టుకుని తరలించడం, వీధి కుక్కల నియంత్రణపై శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram