శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం

గోల్డెన్ న్యూస్ / నంద్యాల  / శ్రీశైలం పాతాళగంగ సమీపంలోని ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఓ ఇంటి దగ్గర తిరిగిన చిరుత సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అవగా, ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పాతాళగంగలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా రాత్రి వేళలు, తెల్లవారుజామున ఒంటరిగా వెళ్లకూడదని సూచిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

అటవీశాఖ సిబ్బంది ప్రాంతంలో గస్తీ పెంచి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram