యువసేన ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ 

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / మండలంలోని తాటిగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జనవరి 12 ,13 ,14 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నట్టు క్రీడల నిర్వాహకులు పోలేబోయిన సత్యనారాయణ తెలియజేశారు వాలీబాల్ క్రీడల కరపత్రం స్థానిక ఎస్సై పివి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడలకు కొదవలేదని నేటి యువత చదువులో, క్రీడల్లోనూ ముందు ఉన్నప్పటికీ డ్రగ్స్, గంజాయి,మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని తగిన విధంగా చైతన్యవంతులు కావాలని వారు ఆకాంక్షించారు. ఏజెన్సీ ప్రాంత క్రీడాకారులు జాతీయస్థాయిలోనూ రాణించేలా లక్ష్యం పెట్టుకోవాలని, చదువుల్లోనూ ఉన్నత చదువులు కొనసాగించాలని ఈ క్రీడలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వాహకులు గొగ్గలి కృష్ణ, కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram