అగ్రికల్చర్ వర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం.. నలుగురిపై వేటు

విధుల్లో ఉండి చదువుకుంటున్న ఏఈవో కాపీ కొడుతూ దొరకడంతో బయటపడిన పేపర్ లీక్ బాగోతం

35 మంది బీఎస్సీ అభ్యర్థుల ప్రవేశాలు రద్దు, ఒక ఉన్నతాధికారితో పాటు నలుగురి సస్పెన్షన్

గోల్డెన్ న్యూస్  /హైదరాబాద్ / ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కంగుతిన్న అధికారులు

 

గత ఏడాది నవంబర్ 21వ తేదీన జగిత్యాల వ్యవసాయ కాలేజీలో బీఎస్సీ సెమిస్టర్ పరీక్షలో, కాపీ కొడుతూ దొరికిన ఇన్ సర్వీస్ ఏఈవో

 

కాపీ కొడుతూ దొరికిన ఘటనపై విచారణ జరపగా, 35 ఇన్ సర్వీస్ అభ్యర్థులు పథకం ప్రకారం ప్రశ్నపత్రం లీక్ చేసి, వాట్సాప్ ద్వారా పలు జిల్లాల్లోని ఇతర అభ్యర్థులకు పంపించినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు

 

దీంతో 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాన్ని రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసిన యూనివర్సిటీ సిబ్బంది

 

పేపర్ లీకేజీ వ్యవహారంలో పలువురు ఉద్యోగులు లంచం తీసుకున్నట్లు గుర్తించి, ఒక ఉన్నతాధికారితో పాటు మరో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram