పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

సంక్రాంతికి తెలంగాణ వాళ్లను ఆహ్వానించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తెలంగాణ వాళ్లకు గోదావరి జిల్లాల వారి ప్రేమను పంచమని సూచించారు. గోదావరి ఆతిథ్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈ చిన్న ఆకు కదిలినా అది వార్త అవుతుందని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చూడాలని కోరారు. ఏదైనా కూలగొట్టడం తేలిక అని, నిలబెట్టడం కష్టమని అన్నారు.పిఠాపురంలో పక్షి ఈక పడినా అది వార్త అవుతుందని అన్నారు. ఈ ప్రచారాన్ని మీరు కూడా సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. పనిచేసే నాయకులకు వెన్నంటి ఉండకపోతే పనులు జరగవని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి వంద ప్రాజెక్టులు ఉంటాయని, ప్రాధాన్యత క్రమంలో అన్నింటినీ చేసుకుంటూ వస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురంలో నిర్వహించిన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పలు స్టాళ్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో కలిసి ఆయన సందర్శించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram