హాజరైన మూడు జిల్లాల క్రీడాకారులు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండల పరిధిలోని తాటిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడలు రెండవ రోజు రసవతరంగా కొనసాగాయి ఈ క్రీడల్లో భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ క్రీడాకారులు హాజరవగా క్రీడలు ఉత్కంఠగా కొనసాగగాయి ప్రజలు ఆసక్తితో తిలకించారు రెండో రోజు పాపాయిగూడెం టీం మీద రాయనపేట గెలుపొందగా, వెంకటాపురం టీమ్ మీద లక్ష్మీ నరసాపురం గెలుపొందగా, తిమ్మాపురం కామారం రాజుపేట కాలనీ చెరువులు సింగారం దొడ్ల తదితరుల గ్రామాల క్రీడాకారుల మ్యాచులు తీవ్ర ఉత్కంఠతో కొనసాగాయి నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంతో క్రీడలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి మండలంలోని పలువురు సర్పంచులు కొమరం సత్యనారాయణ సోలం కేశవరావు తొలెం రమేష్ ఆదివాసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి కుమార్ స్వామి, పాల్గొన్నారు 
Post Views: 345









