రామాలయానికి రూ.2 కోట్లు విరాళం

గోల్డ్ న్యూస్ / వెబ్ డెస్క్ / ఆలయ అభివృద్ధికి ఆస్తిని విరాళంగా రాసిచ్చి.. వృద్ధ దంపతులు ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొచ్చు పెద్ద వీర భద్రుడు, వెంకటేశ్వరమ్మ రూ.2 కోట్లు విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి విరాళంగా ఇచ్చారు. వారికి సంతానం లేకపోవడంతో వారికున్న ఆస్తిని విరాళంగా అందించారు. ఈ మేరకు గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వృద్ధ దంపతులను ఊరేగింపుగా తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram